Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం
- రాష్ట్ర కన్వీనర్ కామెర గట్టయ్య
నవతెలంగాణ- కోల్బెల్ట్
సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వాలు భూగర్భ బొగ్గు గనులకు చరమగీతం పాడే ఆలోచనలో ఉన్నాయని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కామెర గట్టయ్య ఆరోపించారు. శుక్రవారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని బాతాలరాజ్ భవన్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేండ్లుగా అండర్ గ్రౌండ్ గనులలో మెటీరియల్ సప్లై బంద్ చేసిన సింగరేణి యాజ మాన్యం కనీసం కార్మికులకు నిత్యం డ్యూటీలో వాడు కునే పనిముట్లు కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఎస్డీఎల్ యంత్రాలకు సంబంధించిన సామాన్లు, కోల్ కట్టర్, సపోర్ట్ కు సంబంధించిన, లైన్మెన్, టబ్బు రిపేరింగ్ సెక్షన్ వివిధ కేటగిరీలకు సంబంధించిన కార్మికులకు పనిముట్లు కంపెనీ సరఫరా చేయడం లేదని అన్నారు. అండర్ గ్రౌండ్లో పని స్థలాలను కూడా డెవలప్మెంట్ చేయడం లేదని యాజమా న్యం, ప్రభుత్వ విధానాలు చూస్తే భూగర్భ గనుల కు తిలోదకాలు ఇచ్చినట్లే కనిపిస్తుందన్నారు. అండర్ గ్రౌండ్ గనులను లాస్ చూపించి ఓపెన్ కాస్టు గనులు తీయడానికి ప్రభుత్వం, యాజమాన్యం కుట్ర చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. ఒకప్పుడు అండర్ గ్రౌండ్ గనులలో ఎస్డీఎల్ యంత్రాలతో అధిక ఉత్పత్తి సాధించిన చరిత్ర ఉందని, అలాంటిది ఇప్పుడు రెండు సంవత్సరాల కాలం నుండి యాజ మాన్యం అండర్ గ్రౌండ్ గనులలో ఉత్పత్తి పై శ్రద్ధ చూపించడం లేదని అన్నారు. మొత్తంగా ప్రైవేటీ కరణ పేరుతో బహుళ జాతి కంపెనీలకు బొగ్గు గనులను ధారాదత్తం చేసి ఓపెన్ కాస్ట్ గనులతో ఉత్తర తెలంగాణను బొందల గడ్డగా మార్చే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. కార్మిక వర్గం,మేధావులు, సింగరేణిలో చలామణి అవుతున్న వివిధ యూని యన్ నాయకులు ఈ దుస్థితిని గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. యాజమాన్య , ప్రభుత్వ కుట్రలను కార్మిక వర్గం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావే శంలో తెలంగాణ జన సమితి జయశంకర్ జిల్లా కన్వీనర్ రత్నం కిరణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసర్ల ప్రసాద్ రెడ్డి, భూపాలపల్లి ఉపాధ్యక్షులు దాసరి జనార్ధన్, ఏరియా కార్యదర్శి రాళ్ళబండి బాబు, సంఘం నాయకులు జయశంకర్, కె. లింగయ్య, వి. రవి, .లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.