Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని బాల్యతండాలో బొడ్రాయి ప్రతిష్టకు ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ దంపతులు లక్ష రూపాయలు వితరణ చేశారు. కార్యక్రమంలో ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరిసింగ్ నాయక్, జెడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, వైస్ ఎంపీపీ తాత గణేష్, జిల్లా నాయకులు శ్రీకాంత్ నాయక్, సొసైటీ వైస్ చైర్మన్ గంగుల సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి గౌడ్, బాలాజీ పేట సర్పంచ్ వాంకుడోత్ జగన్, ప్రచార కార్యదర్శి తంగళ్లపల్లి ఉపేందర్, యూత్ అధ్యక్షుడు బానోత్ లక్ష్మణ్ నాయక్, యూత్ ఉపాధ్యక్షుడు రేపాకుల వెంకన్న, మండల నాయకులు ఇస్లావత్ వీరన్న, సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.