Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పునరావాసం కోసం భూ సేకరణ చేపట్టాలి
- భూపాలపల్లి జాయింట్ కలెక్టర్ స్వర్ణలత
నవతెలంగాణ-మల్హర్రావు
డేంజర్ జోన్ 500 మీటర్ల దూరంలో ఉన్న ఇండ్ల జాబితాను సిద్ధం చేయాలని తహసీల్ధార్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శిని భూపాలపల్లి జిల్లా జేసీ కూరాకుల స్వర్ణలత ఆదేశించారు. శుక్రవారం మండల తహసీల్ధార్ కార్యాలయంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, జెన్కో అధికా రులతో సమీక్ష సమావేశం నిర్వహించి జేసీ మాట్లాడారు. పంచాయితీ 2010 రికార్డుల ప్రకారం డేంజర్ జన్‌లో ఉన్న ఇండ్ల జాబితాను తయారు చేసి నాలుగైదు రోజుల్లో కలెక్టరేట్‌కు తీసుక రావాలని ఆదేశించారు. ఇటీవల నోటీస్ బోర్డుపై వేసిన 1399 ఇండ్ల జాబితాలో నిర్వాసితుల నుంచి వచ్చిన అభ్యంతరాల మేరకు ఇంటింటా సర్వేలు నిర్వహించి రికార్డులు పరిశీలించగా 1264 ఇండ్లు రికార్డుల్లో ఉండగా మిగతావి లేనట్లుగా తేలిందని తహసీల్ధార్ వివరించారు. టీఎస్ జెన్కో నెంబర్లు వేసిన ప్రకారం 2,256 ఉండగా స్థానికేతరులు కాకుండా స్థానిక నిర్వాసితుల అందరిని జాబితాలో చేర్చాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నట్లు జేసీ దష్టికి తీసుకొచ్చారు. ఇండ్ల పరిహారం ఇచ్చి,త్వరలో ఆర్అండ్ఆర్ ప్యాకేజి, పునరావాసం కల్పించే నిర్వాసితులకు సరిపడా మరో 5ఎకరాల భూమిని సేకరించాలని జెన్కో అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు,మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలో కొనసాగుతున్న పునరుద్ధీకరణ అభివద్ధి పనులు వేగంగా చేపట్టాలని పంచాయతీ రాజ్ అధికారు లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్డిఓ శ్రీనివాస్, తహసీల్ధార్ శ్రీనివాస్, పంచాయతీ రాజ్, జెన్కో అధికారులు పాల్గొన్నారు.
జేసీ, ఆర్డిఓల కాన్వారులు అడ్డగింత
ఇటీవల రెవెన్యూశాఖ అధికారులు నోటీస్ బోర్డుపై వేసిన ఆర్అండ్ఆర్ ప్యాకేజి,పునరావాసం పిడిఏప్ జాబి తాలో స్థానికేతరుల పేర్లు వచ్చి ఏండ్లుగా ఇక్కడే జీవిస్తున్న 22మంది(ఆదివాసీ గిరిజన నాయకపోడు) పేర్లు రాలేదని కాపురం గ్రామ భూ నిర్వాసితులు భూపాలపల్లి జిల్లా జేసీ స్వర్ణలత, ఆర్డిఓ శ్రీనివాస్ కాన్వారులు అడ్డుకుని కాన్వారుల ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ... తాము ఊరు పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్న క్రమంలో జెన్కో ఉపరితలంలో ఊరు కోల్పోతున్న నేపథ్యంలో తమ ఇండ్లకు పదేండ్ల క్రితం నష్టపరిహారం ఇచ్చి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ లిస్టు ప్రకటించగా 22మంది స్థానిక నిర్వాసితుల పేర్లు గల్లంతయ్యాయని కన్నీరుమున్నీర య్యారు. స్థానికేతరులు, అసలే ఇండ్లు కట్టని వారి పేర్లు జాబితాలో వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పేర్లు రాలేదని విన్నవించినా, దరఖాస్తులు తీసుకొని న్యాయం చేయాలని కార్యాలయాల చుట్టూ తిరిగినా రెవెన్యూ అధి కారులు పట్టించుకోవడం లేదని జేసికి గోడును వినిపిం చారు. తాము ఆదివాసీ గిరిజనులమనే అధికారులు చిన్న చూపు చూస్తూ స్థానికేతరుల పేర్లను మాత్రం జాబితాలో చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసేంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు. అనర్హుల పేర్లను తొలగించి,అర్హుల పేర్లను కమిషనరేట్ కు పంపాలని విజ్ఞప్తి చేశారు. అర్హులకు న్యాయం చేస్తామని, ఈనెల 23న కలెక్టర్ భూపాలపల్లి కార్యాలయానికి రావాలని భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు దండు రమేష్ తో ఆర్డిఓ భరోసా ఇచ్చారు. దీంతో నిర్వాసితులు ఆందోళన విరమిం చారు. నిర్వాసితులు మహంకాళి, రాజయ్య,ప్రశాంత్,బండి స్వామి, సదయ్య, సమ్మయ్య తోపాటు వందమంది నిర్వాసితులు పాల్గొన్నారు.
అర్హుల పేర్లు ఎలా గల్లంతయ్యాయి
: భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు రమేష్
రెవెన్యూ అధికారులు ఇటీవల నోటీస్ బోర్డుపై వేసిన ఆర్అండ్ఆర్ ప్యాకేజి, పునరావాస పీడీఏప్ జాబితాలో అనర్హుల పేర్లు వచ్చి, అర్హుల పేర్లు ఎలా గల్లంతయ్యాయో రెవెన్యూ అధికారులు చెప్పాలని భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు దండు రమేష్ ప్రశ్నించారు. శుక్రవారం మండల తహసీల్ధార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 13 సంవ త్సరాల క్రితం కాపురం, తాడిచెర్ల ఎస్సికాలనిలో జెన్కో ఉపరితలంలో కోల్పోయిన ఇండ్లకు నష్టపరిహారం ఇచ్చి ఆర్అండ్ఆర్ ప్యాకేజి, పునరావాసం కల్పించడంలో ఇటు రెవెన్యూ, అటు జెన్కో అధికారులు సర్వేల పేరిట కాలయా పన చేసి మూడు నెలల క్రితం గ్రామపంచాయితి కార్యా లయ ఆవరణలో పీడీఏప్ జాబితాను అధికారులు ప్రదర్షిం చడం జరిగిందన్నారు. జాబితా ప్రదర్శించిన క్రమంలో అర్హుల పేర్లు రాలేదని,రాకపోవడానికి ప్రభుత్వం, అధికా రుల అలసత్వమే కారణమని, ఇండ్ల పరిహారం ఇచ్చినప్పుడు 13 ఏళ్ళు ఉన్న యువత ప్రస్తుతం 23 ఏళ్ల వయసుకు వచ్చారని వారికి కూడా ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇవ్వాలని పలుమార్లు విన్నవించి,దరఖాస్తులు ఇచ్చామని గుర్తు చేశారు. అయినా అధికారులు ఇటీవల తాడిచెర్ల 61, కాపురం 171 నిర్వాసితుల పీడీఏప్ జాబితాలో కాపురం గ్రామంలో అసలే ఇండ్లు కట్టని, పరిహారం పోయిందని 9మంది స్థానికేతరుల పేర్లు వచ్చి, అర్హులైన 22 మంది పేర్లు రాలేదని ఆరోపించారు. పేర్లు రాని బాధిత నిర్వాసితులు రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు ఇచ్చినా తీసుకోవడం లేదని మండిపడ్డారు. 9మంది అనర్హుల పేర్లు జాబితాలో రావడం వల్ల రూ.60లక్షల ప్రజాసొమ్ము దుర్వినియోగం అవుతుందన్నారు. ఇప్పటికైనా భూపాలపల్లి జిల్లా కలెక్టర్, ఆర్డిఓ,మండల రెవెన్యూ అధికారులు స్పందించి నిజానిర్దారణ విచారణ చేపట్టి, అనర్హులను తొల గించి, అర్హులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజి, పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే నిర్వాసితులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో నిర్వాసితులు ఇందరపు శివ,రాజయ్య,శ్రీనివాస్ తోపాటు వందమంది నిర్వాసితులు పాల్గొన్నారు.