Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
రైతుల, ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గోవర్ధన్ కోరారు. మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమా వేశంలో చలో హైదరాబాద్ కార్యక్రమ వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం గోవర్ధన్ మాట్లాడారు. పోడు భూములకు పట్టాలిచ్చే ప్రక్రియలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార పార్టీ నాయకుల జోక్యం ఉండొద్దన్నారు. పోడు భూములకు పట్టాలివ్వాలని, నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐకేఎంఎస్ మండల ప్రధాన కార్యదర్శి యాదగిరి యుగంధర్, గజ్జి సోమన్న, పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు శ్రీశైలం, గణేష్, రియాజ్, పార్టీ నాయకులు గట్టి సురేందర్, కల్తీ వెంకన్న, గట్టయ్య, లక్ష్మయ్య, సుధాకర్, కొమురయ్య, జామ్లా తదితరులు పాల్గొన్నారు.