Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గునిగంటి రాజన్న
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-మహబూబాబాద్
వైరస్ వల్ల పంటలు నష్టపోయిన మిర్చి రైతులకు, కౌలు రైతులకు పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గునిగంటి రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సంఘం కమిటీ ఆధ్వర్యంలో తహసీల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడారు. వైరస్ వల్ల జిల్లాలోని వందలాది ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతిందని చెప్పారు. పంట నష్టపోయిన రైతులతోపాటు కౌలు రైతులకూ పరిహారం ఇవ్వాలని, పోడు రైతులకు హక్కుపత్రాలివ్వాలని, మండలంలో తులారం కుడికాల్వ ద్వారా కంబాలపల్లి, నడివాడ, రెడ్యాల, జమాండ్లపల్లి గ్రామాల రైతులకు సాగు, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు గుర్రాల మల్లారెడ్డి, పోరెడ్డి వెంకట్‌రెడ్డి, బానోత్ వెంకట్రాములు, ధరావత్ బాలు, శ్రీను, రామ్మూర్తి, గణేష్, గాడిపెల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.