Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
నవతెలంగాణ-కాజీపేట
రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్ తెలిపారు. కార్మిక మాసోత్సవాల్లో భాగంగా స్థానిక మల్లికార్జున స్వామి ఆలయ కల్యాణ మండపంలో శక్తి అవార్డు గ్రహీతలను ఎమ్మెల్సీ బండా ప్రకాష్‌తో కలిసి వినరుభాస్కర్ శుక్రవారం సన్మానించారు. అనంతరం వినరు భాస్కర్, బండా ప్రకాష్ మాట్లాడారు. సంఘటిత, అసంఘటిత కార్మికుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. కార్మిక శాఖ బీమా వల్ల కడిపికొండకు చెందిన బాధితులకు రూ.6 లక్షలు చొప్పున బీమా అందిందని చెప్పారు. ఈనెల 22, 23 తేదీల్లో కార్మికులకు క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన శ్రమశక్తి అవార్డు గ్రహీతలు బస్కే దశరధం, సంద్యల హరినాథ్, నల్ల భారతి, మల్లేశం, శ్రీకాంత్, సత్యనారాయణలను సన్మానించారు. తదనంతరం ఓరుగల్లు డ్రైవర్స్ యూనియన్ డైరీని ఆవిష్కరించి కార్మిక చైతన్య ప్రసాదం ప్రారంభించారు. కార్యక్రమంలో కార్మిక చైతన్య సదస్సు కన్వీనర్ పుల్ల శ్రీనివాస్, లేబర్ అధికారి శామ్యూల్, తదితరులు పాల్గొన్నారు.