Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏ ఏపీఓ వసంతరావు
నవతెలంగాణ-ఏటూరునాగారం టౌన్
గిరిజనులు మెళకువలు నేర్చుకుని వ్యాపారాల్లో రాణించాలని ఐటీడీఏ ఏపీఓ వసంతరావు కోరారు. హైదరాబాద్‌కు చెందిన విహబ్ సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన వ్యాపారస్తులకు శుక్రవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. సదస్సుకు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వ్యాపారాలు చేస్తున్న, చిన్న తరహా పరిశ్రమల్లో అనుభవం ఉన్న సుమారు 200 మంది గిరిజన వ్యాపారస్తులు హాజరు కాగా ముందుగా ప్రాజెక్ట్ ప్రోగ్రాం మేనేజర్ తరుణ్, ఎల్డీఎం శ్రీనివాస్‌రావు, జీఎం శ్రీనివాసులు మాట్లాడారు. వ్యాపారం కోసం రుణాలు పొందడానికి గిరిజనులకు ఉండాల్సిన అర్హతలు, నిబంధనలను వివరించారు. అకౌంట్ రికార్డులను పాటిస్తూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం ద్వారా పెట్టుబడి, రాబడి, లాభం వివరాలు తెలుస్తాయని చెప్పారు. రుణానికి తగ్గట్టు బ్యాంకులకు ఆస్తిని చూపించాల్సి ఉంటుందన్నారు. సమాజంలో డిమాండ్ ఉన్న వ్యాపారాలను ఎంచుకోవాలని సూచించారు. పౌల్ట్రీ ఫామ్, ఇటుకల తయారీ లాంటి వ్యాపారాలతో మెరుగైన లాభాలు పొందవచ్చని చెప్పారు. అనంతరం ఏపీఓ వసంతరావు మాట్లాడారు. వి హబ్ సంస్థ ద్వారా వ్యాపారస్తులు మెలకువలు పాటించి చైతన్యవంతులు కావాలని చెప్పారు. కొత్తగా వ్యాపారంలోకి రావాలనుకుంటున్న గిరిజన యువతకు జూన్ 22, 23 తేదీల్లో సంస్థ శిక్షణ ఇవ్వనుందని తెలిపారు. సదస్సులో భూపాలపల్లి, ములుగు ఎల్డీఎంలు శ్రీనివాస్‌రావు, లక్ష్మణ్, ఇండిస్టీస్ విభాగం జనరల్ మేనేజర్ శ్రీనివాస్, వి హబ్ ప్రాజెక్ట్ మేనేజర్ తరుణ్, కోఆర్డినేటర్ అన్నపూర్ణ, బీపీఎం సతీష్, జేడీఎం కొండల్రావు, ఐటీడీఏ మేనేజర్ లాలు నాయక్, జేఆర్పీ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.