Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
రైతులు తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ దిగుబడి సాధించి ఆర్థికంగా ఎదగా లని డీఏఓ చత్రు నాయక్ కోరారు. మండల కేంద్రంలో పీఏసీఎస్ చైర్మెన్ కాసం లక్ష్మిచంద్రశేఖర్రెడ్డి, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, జెడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఏఓ నెలకుర్తి రవీందర్‌రెడ్డితో కలిసి సబ్సిడీపై జీలుగు విత్తనాల పంపిణీని చత్రునాయక్ శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు జీలుగు 20 కేజీల ప్యాకెట్‌ను వ్యవసాయ క్షేత్రంలో చల్లితే అది రెండున్నర ఎకరాలకు వస్తుందని తెలిపారు. జీలుగు ఎదిగిన తర్వాత కొద్దిరోజుల తర్వాత కలిపి రైతు సాగు చేసుకున్నట్లయితే డీఏపీ బస్తా సమానం అవుతుందని తెలిపారు. మండలంలోని శ్రీరామగిరి, ఎర్రబెల్లిగూడెం రైతు ఆగ్రోస్ కేంద్రాల్లో జీలుగులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో ఏఓ రవీందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ యాదగిరిరెడ్డి, ఎంపీటీసీ వాణి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ జెల్లా వెంకటేష్, తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మెన్ కాసరా బోయిన విజరు యాదవ్, సొసైటీ డైరెక్టర్ ఠాన్సింగ్, తదితరులు పాల్గొన్నారు.