Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ 6 నుంచి పలురకాల నిరసనలు
- కేయూ తాత్కాలిక ఉద్యోగ సంఘాల జేఏసీ
నవతెలంగాణ-హన్మకొండ
కాకతీయ విశ్వవిద్యాలయ తాత్కాలిక ఉద్యోగుల వేతనాలు పెంచాలని కోరుతూ టెంపరరీ ఎంప్లాయిస్ అసోసియేషన్, డైలీవేజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఎస్డీఎల్సీఈ ఎంప్లాయిస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య బైరు వెంకట్రాంరెడ్డికి కేయూ తాత్కాలిక ఉద్యోగ సంఘాల జాక్ తరపున శుక్రవారం సమ్మె నోటీస్ ఇచ్చారు. తాత్కాలిక ఉద్యోగులకు వేతనం మీద 30 శాతం పెంచాలని సుమారు ఆర్నెళ్లుగా పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా, ఆందోళన చేసినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. గడువులోగా వేతనాలు పెంచని పక్షంలో జూన్ 6 నుంచి తాత్కాలిక ఉద్యోగులను కలుపుకొని వివిధ రకాల నిరసన కార్యక్రమాలతోపాటు నిరవదిక సమ్మె చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు డాక్టర్ పొడిశెెట్టి విష్ణువర్ధన్, నాగుల శివప్రసాద్, డాక్టర్ శాగంటి శ్రీనివాస్, డాక్టర్ సుదయ్య, సంగాల సుధాకర్, కుమార్, కొడకండ్ల రాజమహేందర్, శివానంద్, ఫిరోజ్, అశోక్, రవీంద్రనాథ్, తదితరులు పాల్గొన్నారు.