Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్మెన్ మంగళపల్లి రామచంద్రయ్య
నవతెలంగాణ-తొర్రూరు
రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలను ఆదుకునేందుకే కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తోందని మున్సిపల్ చైర్మెన్ మంగళపల్లి రామచంద్రయ్య తెలిపారు. మండల అభివద్ధి కమిటీ చైర్మెన్ డాక్టర్ పోనుగొటి సోమేశ్వర్రావు, వైస్ చైర్మెన్ జినుగు సురేందర్‌రెడ్డి, కమిషనర్ గుండె బాబుతో కలిసి మున్సిపాల్టీ పరిధిలోని పలు వార్డుల్లోని లబ్దిదారుల ఇండ్లకు రామచంద్రయ్య శుక్రవారం వెళ్లి కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం రామచంద్రయ్య మాట్లాడారు. పేద దళిత, గిరిజన, మైనార్టీ యువతుల వివాహానికి సాయం అందించేలా ప్రభుత్వం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎన్నమనేని శ్రీనివాస్‌రావు, గుగులోత్ శంకర్, నరుకుటి గజానంద్, ధరావత్ సునీత, జైసింగ్, భూసాని రాము, తూనం రోజా, తూర్పాటి సంగీత రవి, యమున జంప, దొంగరి రేవతి శంకర్, చకిలవేని అలివేలు నాగరాజు, కర్నె జ్యోతి నాగరాజు, కొలువుల శంకర్, బిజ్జాల మాధవి అనిల్, తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లం అర్జున్ రాజు, తదితరులు పాల్గొన్నారు.