Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ లీగల్
రాష్ట్ర న్యాయ శాఖ సెక్రటరీగా నియమితులైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగరావుకు వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జడ్జిలు, ప్రభుత్వ ప్లీడర్లు, పబ్లిక్ ప్రాజిక్యూటర్లు, న్యాయవాదులు నర్సింగరావును ఘనంగా సన్మానించారు. అలాగే నర్సింగరావును జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గజమాల, శాలువా, భద్రకాళి అమ్మవారి చిత్రపటంతో సత్కరించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడారు. న్యాయమూర్తులు సమన్వయంతో పని చేసి ప్రజలకు న్యాయసేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ సిరికొండ సంజీవరావు, జయాకర్, దుస్స జనార్ధన్, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్కుర్తి ఆనందమోహన్, వైస్ ప్రెసిడెంట్ ఎదులాపురం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గునిగంటి శ్రీనివాస్ గౌడ్, జాయింట్ సెక్రెటరీ నవీన్ కుమార్, లైబ్రరీ సెక్రెటరీ జన్ను ఆనంద్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.