Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
బయ్యారం పెద్దచెరువు కాల్వలకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయించి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మండ రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో తోడుసు యాదగిరి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో మండల కార్యదర్శి నంబూరి మధుతో కలిసి రాజన్న మాట్లాడారు. ఏటా నాట్లు వేసే సమయంలో కాల్వలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం వల్ల చివరి ఆయకట్టు రైతులకు సక్రమంగా సాగునీరు సరఫరా కావడం లేదన్నారు. జిల్లాకు తలమానికంగా ఉన్న పెద్దచెరువు బయ్యారం, గార్ల మండలాలకు సాగు, తాగునీరు అందిస్తుండగా కాలువలు అస్తవ్యస్తంగా ఉండడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే కాల్వల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై నిధులు మంజూరు చేయించడంలో చొరవ చూపాలని మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియ, జెడ్పీ చైర్పర్సన్ బిందులను కోరారు. సమావేశంలో మండల నాయకులు చంటి, విజయ, శ్రీను, మోహన్, బి వెంకన్న, ఆనందరావు, రమేష్, వివెంకన్న తదితరులు పాల్గొన్నారు.