Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
మండలంలోని ఇనుగుర్తి గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యుడుగా ఎంపిక కావడంతో ఆయన్ను ఆ పార్టీ ఇనుగుర్తి నాయకులు హైదరాబాద్లోని నివాసంలో ఆదివారం కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. గ్రామానికి చెందిన తమ నాయకుడికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వడం పట్ల సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రవిచంద్ర మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా ముందుకు సాగుతున్న క్రమంలోనే సీఎం కేసీఆర్ తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారని చెప్పారు. నిత్యం ప్రజల్లోనే ఉండి సేవలు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పింగిళి శ్రీనివాస్, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ మాలోత్ మంగ్యానాయక్, లాలుతండా సర్పంచ్ బానోత్ రామన్ననాయక్, ఉపసర్పంచ్ గుండ్రపెల్లి దేవేందర్, జాటోత్ హరిచంద్, మాలోత్ చిన్న మంగ్యా, వార్డు సభ్యుడు గుజ్జునూరి వెంకన్న, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కర్ర నర్సింహారెడ్డి, సట్ల భిక్షపతి (వాలీబాల్), పప్పుల వెంకన్న (108), మలిశెట్టి రవి, గుండ్రపెల్లి శ్రీను, లింగాల శ్రీను, కూటికంటి మధు, వేముల శ్రీను, ఓరుగంటి సూరయ్య, గంజి రమేష్ రెడ్డి, దార్ల భాస్కర్, మల్లెపాక రమేష్, లకావత్ సంతోష్, బోల్ల కొమురయ్య, నాగెల్లి మురళీ, ఎలమద్రి ప్రభాకర్, నాగెల్లి కిరణ్, బూర రజినీకాంత్, పెండ్లి మహేందర్, గుజ్జునూరి పరుశురామ్, బేతమల్ల మనోజ్, పప్పుల కుమార్, నాగెల్లి మురళీ (సింగర్), దేవులపెల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.