Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ ప్రహ్లాద్
నవతెలంగాణ-మంగపేట
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ నేత, ములుగు మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ అజ్మీరా ప్రహ్లాద్ శ్రేణులను కోరారు. మండలంలో ఆదివారం ఆయన పర్యటించారు. టీఆర్ఎస్ పార్టీ అనుబంధ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు అఫ్జల్ సోదరుడు షేక్ తాజ్ కూతురు వివాహానికి హాజరై నూతన దంపతును ఆశీర్వదించారు. అనంతరం కోమటిపల్లిలో ఆత్మ మాజీ చైర్మెన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పగిడిపెల్లి వెంకటేశ్వర్లు మామ బొప్పన బెంజమిన్ సంతాప సభకు హాజరై ఆ కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడారు. అన్ని తరగతుల ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోందని చెప్పారు. పార్టీ శ్రేణులకు, ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు పచ్చ శేషగిరిరావు, మాజీ జెడ్పీటీసీ సిద్దంశెట్టి వైకుంఠం, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సామ మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ మండవ రామకృష్ణ, సీనియర్ నాయకులు కొమరగిరి కేశవరావు, కోదండం, అన్నపురెడ్డి రాణా ప్రతాప్‌రెడ్డి, బచ్చలకూర ప్రసాద్, ఇబ్రహీమ్ పాషా, అఫ్జల్, అయూబ్, అన్వర్, ఇంతియాజ్ బుట్టో, హనుమంతరావు, అంతటి నాగరాజు, కర్ర రవీందర్, యలవర్తీ శ్రీనివాస్ రావు, వినోద్, రమేష్ తదితరులున్నారు.