Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్
నవతెలంగాణ-మహబూబాబాద్
ఆది హిందూ సభ స్థాపకుడు భాగ్యరెడ్డివర్మను సంఘ సంస్కర్తగా, తెలంగాణలో సామాజిక సంస్కరణోద్యమానికి జీవం పోసిన తొలితరం వైతాళికుడుగా జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అభిలాష అభినవ్ అభివర్ణించారు. కలెక్టరేట్లోని ప్రగతి సమావేశ మందిరంలో భాగ్యరెడ్డివర్మ జయంతిని ఆదివారం అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యరెడ్డివర్మ చిత్రపటానికి అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. భాగ్యరెడ్డివర్మ దళిత బాలికా విద్యాభివద్ధి కోసం పాఠశాలలను స్థాపించారని, మన్య సంఘాన్ని ఏర్పాటు చేసి రీడింగ్ రూములు నిర్వహించారని చెప్పారు. సాహిత్యం, హరికథలు, ఉపన్యాసాల ద్వారా అణగారిన వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చారని తెలిపారు. అంటరానితనం, దేవదాసి, జోగిని దురాచారాల నిర్మూలనకు పాటుపడ్డారని వివరించారు. కార్యక్రమంలో డీఎస్సీడీఓ సన్యాసయ్య, కలెక్టరేట్ పరిపాలన అధికారి వెంకటరమణ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మంగపేట : మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలో తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో భాగ్యరెడ్డివర్మ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యుడు రాజమల్ల సుకుమార్ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు గండి ధర్మరాజు, బిల్పాటి రాజు, బిల్పాటి పండు, చింతల కిరణ్, గండి లక్ష్మీ, వేమూరి సావిత్రి, రాజమల్ల సువార్త పాల్గొన్నారు.