Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి దయాకరరావు
నవతెలంగాణ-లింగాలఘణపురం
ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అంబేదకర్ అందరి వాడని, ఆయన కల్పించిన హక్కుల సాధన తోనే తెలంగాణ సాదించుకు న్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఆదివారం రాత్రి మండలం లోని మాణిక్యపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సర్పంచి శ్వేతపూర్ణచందర్ అధ్యక్షత సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబెద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కషి చేయాలన్నారు. ఆయన స్పూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అన్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలకు న్యాయం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయుడు అని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి , జెడ్పీటీసీ గుడి వంశీదర్ రెడ్డి, జిల్లా దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, మండల సమన్వయకర్త నాగేందర్ ,మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.