Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దంతాలపల్లి
మండలంలోని మహాత్మ జ్యోతిరావుపూలే పాఠశాలలో 2004-05 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సాంబారెడ్డిని, ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకన్న, మురళీ, రాంరెడ్డి, వెంకన్న, విద్యార్థులు రాము, తదితరులు పాల్గొన్నారు.