Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
ఈనెల 23 నుంచి జరగనున్న టెన్త్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ గా ఏర్పాట్లు చేసినట్టు ఎంఈఓ యాప సాంబయ్య తెలిపారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డారు. మండలంలోని ఇందిరానగర్, నార్లా పూర్ జెడ్పీ హైస్కూళ్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్ష రాసే విద్యా ర్థుల కోసం తాగునీటి, మరుగుదొడ్లు, మూత్ర శాలలు, తదితర మౌలిక వసతులు కల్పించడం తోపాటు సీసీ కెమెరాలు, వైద్యశిబిరం ఏర్పాటు చేయించామని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగా చేరుకోవాలని సూచించారు. సమావేశంలో పరీక్షల సీఎస్ సారంగపాణి, డీఓ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.