Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ శరత్చంద్ర పవార్
నవతెలంగాణ-మహబూబాబాద్
క్రీడలతో మానసిక, శారీరక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్ఐ సురేష్, సీఐ సాగర్ నాయకత్వంలోని, తొర్రూరు సబ్ డివిజన్ టీమ్‌లు పోటీపడ్డాయి. తొర్రూరు, ఏఆర్ టీమ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగ్గా ఏఆర్ టీమ్ విజయం సాధించింది. ఈ సందర్భంగా విజేతలతోపాటు ప్రతిభ చాటిన క్రీడాకారులకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ మెమోంటోలు అందించి అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. పోలీసులు విధి నిర్వహణలో మానసిక, శారీరక ఒత్తిడి గురవడం సహజమన్నారు. క్రీడల్లో పాల్గొంటే ఒత్తిడి దూరం అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్, తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ, ఏఆర్ డీఎస్పీలు జనార్ధన్‌రెడ్డి, సదానందం, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.