Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నర్మెట్ట
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం పై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి అన్నారు. ఆదివారం నర్మెట్ట మండల కేంద్రంలో మండల అధ్యక్షులు ధరావత్ రాజునాయక్ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నరేంద్ర మోడీ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లా డారు. ధరలు తగ్గించి మధ్య తరగతి, పేద ప్రజల పక్షాన బీజేపీ నిలిచిందన్నారు. ఈ సందర్భగా మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం పేదల పక్షపాతి కేంద్ర ప్రభుత్వం అన్నార. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యాట్ ను తగ్గించక పోవడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు, బస్సు ఛార్జీల, మద్యం ధరలు పెంచి పేద వర్గాలపై అదనపు భారం వేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని పర్యటన ఉంటే సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులు విద్యార్థులు ఆర్టీసీ కార్మికులు ఉద్యో గులు ఆత్మహత్య చేసుకుంటే వారిని పరామర్శించకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆర్థిక సహాయం అందించడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మండల కార్యదర్శి ధరావత్ వినోద్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి బైరగోని ఆంజనేయులు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట వినోద్, కిసాన్‌మోర్చా మండల అధ్యక్షులు జంగిటి నాగేశ్వర్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శులు భూక్య శ్రీను, రంజిత్, ధారవత్ రాజు, బూత్ అధ్యక్షులు నాగేశ్, తదితరులు పాల్గొన్నారు.