Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
నేటి నుండి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయని, మహాదేవపూర్ మండల కేంద్రంలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎంఈఓ దేవ సింగ్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లా డారు. 306 మంది రెగ్యులర్ విద్యార్థులు 94 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని పేర్కొన్నారు. బాలబాలి కలకు వేరువేరుగా రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గత రెండేళ్లు పరీక్షలు పెట్టకుండానే విద్యార్థులను ఉత్తీర్ణులు చేశారని, రెండు సంవత్సరాల తర్వాత తొలిసారిగా పరీక్షలు జరగబోతు న్నాయన్నారు. నేటితో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు జూన్ 1న ముగు స్తాయని తెలిపారు. ఉదయం తొమ్మిదన్నర గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు జరుగు తాయని తెలిపారు. మండల వ్యాప్తంగా మొత్తం కలిపి 400మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని తెలిపారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ప్రతీ సెంటర్ను సూప రింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారి పర్యవేక్షిస్తారని తెలిపారు. పరీక్షల్లో మాస్ కాపియింగ్ను అరికట్టడానికి నాలుగు స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశా మన్నారు. హైదరాబాద్లో అత్యధికంగా 406 సెంటర్లు ఉండగా జయశంకర్ భూపాలపల్లిలో అత్యల్పంగా 20 పరీక్షా కేంద్రాలు ఉన్నాయన్నారు. ఎండల వల్ల విద్యార్థులు ఇబ్బంది పడకుండా పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి అందుబాటులో ఉంచామన్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతీ కేంద్రం వద్ద ఏఎన్ఎం, ఆశా వర్కర్తోపాటు మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామన్నారు. కరోనా కారణంగా తరగతులు సక్రమంగా జరగకపోవడంతో పరీక్షల నిర్వహణలో పలు మార్పులు చేశారని, పరీక్షల సిలబస్ 70 శాతానికి కుదించారన్నారు. విద్యా ర్థులు అందరూ భయం, ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలని, విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేలా తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాల న్నారు. పదో తరగతి విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంద న్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే పరిష్కరించేం దుకు రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.