Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఈఓ రాము
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
పట్టుదలతో చదివి అవగాహన చేసు కుంటే పోటీపరీక్షల్లో విజయం వరిస్తుందని జనగామ డీఈఓ రాము అన్నారు. స్థానిక ఏకశిలా పబ్లిక్ స్కూల్ లో టీపీటీఎఫ్ ఆధ్వ ర్యంలో టెట్-2022 పరీక్షకు హాజర వుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిం చారు. శిక్షణ ముగింపు సందర్భంగా ఆది వారం టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు లక్ష్మయ్య అధ్యక్షత ఏర్పాటు ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టెట్ అభ్య ర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చి మోడల్ పరీక్ష నిర్వహించడం అభినందనీయమని అబి ప్రాయపడ్డారు. సామాజిక బాధ్యతలు నిర్వ హించడంలో టీపీటీఎఫ్ ఇతర సంఘా లకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అనం తరం టెట్ అభ్యర్థులకు మోడల్ పరీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏకశిల విద్యా సంస్థల చైర్మన్ ఉపేందర్‌రెడ్డి, మాచర్ల బిక్షపతి, టీపీటీఎఫ్ స్టేట్ కౌన్సిలర్లు శ్రీనివాస్, కుర్రెముల యాదగిరి, జిల్లా కమిటీ సభ్యు లు అంకుశలి, సునంద, రాజారెడ్డి, టుటోరి యల్ ఆఫీసర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.