Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
తాజాగా ముంబైలో జరిగిన జాతీయస్థాయి జూనియర్ లెవల్ కరాటే పోటీల్లో మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గాదగాని పుష్పరాజు, సంధ్య దంపతుల కుమారుడు శివతేజ ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించాడు. ఇంతకుముందు హనుమకొండ ఖమ్మం జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. కరాటేలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న శివతేజను, మాస్టర్ సోమ శ్రీధర్‌ను సోమవారం వెంకటాపురం గ్రామంలో సర్పంచ్ శీలం లింగన్న గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయిలో కరాటేలో విశేష ప్రతిభ కనబర్చడం పట్ల సర్పంచ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లింగన్నగౌడ్ మాట్లాడుతూ... సమాజంలో జరుగుతున్న సంఘటనల దష్ట్యా ఆత్మరక్షణ కోసం కరాటే వైపు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. ఆత్మరక్షణ కోసం చిన్నారులు, యువత కరాటే నేర్చుకోవాలని కోరారు. గ్రామాల్లో క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన శివతేజకు అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. గ్రామాల్లో క్రీడా అభివద్ధికి ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బోపెళ్లి లక్ష్మణ్‌రావు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బోలాగని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వీరరెడ్డి, సీనియర్ నాయకులు ప్లాహదర్ రావు, కార్యదర్శి మమత, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.