Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ రాడపాక సుదర్శన్
నవతెలంగాణ-జఫర్గడ్
జూన్ 3 నుండి ప్రారంభమయ్యే పల్లె ప్రగతి విజయవం తానికి ప్రజాప్రతినిధులు అధికారులు కషి చేయాలని ఎంపీపీ రాడపాక సుదర్శన్ అన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షులు రాడపాక సుదర్శన్ అధ్యక్షత నిర్వహించారు. అనంతరం వివిధ శాఖల పై నామమాత్రంగా చర్చలు జరిపారు. మండల సర్పంచులు సర్వసభ్య సమావేశం అంటే చిన్న చూపు చూసి... రావడం లేదు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయమని మొండిగా వైఖరించినా సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారన్నారు. రైతును రాజు చేయాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ధీమా వ్యక్తం చేశారు. జూన్‌లో జరిగే పల్లె ప్రగతిలో గ్రామాలలో అనేక అభివద్ధి కార్యక్రమాలు చేయనున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో క్రీడామైదానం కోసం ఎకరం భూమి చూసి క్రీడామైదానం గా ఎంపిక చేయాలన్నారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్, పీఏసీఎస్ చైర్మెన్ కరుణాకర్‌రావు, జెడ్పీటీసీ బేబీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కనకయ్య, తాసిల్ధార్ స్వప్న, ఎంపీడీవో శ్రీధర్ స్వామి, ఎక్సైజ్ ఎస్సై పద్మ, ఎంపీటీసీలు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.