Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్
నవతెలంగాణ-గూడూరు
దేశంలో, రాష్ట్రంలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నాయకత్వంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ అన్నారు. సోమవారం గూడూరు మండలకేంద్రంతోపాటు సీతానగరం, భూపతిపేట గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి స్వామి అధ్యక్షతన రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బలరాం నాయక్ హాజరై గ్రామ ప్రజలతో మమేకమై గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరంగల్ డిక్లరేషన్ ను ప్రజలకు వివరించారు. దేశం కోసం ఆవిర్భావించి దేశ రక్షణ, దేశ ప్రజల కోసం ప్రాణాలర్పించిన కాంగ్రెస్ పార్టీని ఆదరిం చాలన్నారు. ప్రభుత్వాలు ప్రతీ వస్తువుపై ధరలు పెంచి పేదలకు అన్యాయం చేస ్తన్నారని ఆరోపించారు. గ్యాస్,పేట్రోల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపా ధ్యక్షులు శ్రీ వేం నరేందర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు జిన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి,మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు నునవత్ రాధ, టీపీసీసీ అధికార ప్రతినిధి తేజవత్ బెల్లయ్య నాయక్, టీపీసీసీ సభ్యులు దస నాయక్, కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రీకాంత్ రెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకన్న పాల్గొన్నారు.