Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.1.50 లక్షల నష్టం
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని బుచ్చంపేటలో వరి కొయ్యకాలు అంటుకొని ఎగసిపడ్డ యరగల్లతో గ్రామానికి చెందిన కొట్టె రాజేష్ రైతు కల్లంలో కాంటా వేసి ఉన్న ధాన్యం బస్తాలకు అంటుకుని కాలిపోయిన ఘటనలో రూ. 1.50 లక్షల పంట నష్టం వాటిల్లినట్లు రైతు వాపో యాడు. బాధితుని కథనం మేరకు గ్రామంలో మధ్యా హ్నం వీచిన ఈదురు గాలులకు వరి చేలలోని కొయ్య కాలు గడ్డికి మంటలు అంటుకొని క్షణాల్లో పొలం మంతా వ్యాపించాయి. కల్లాంలోని ధాన్యం కాంటకు పెట్టి లోడింగ్‌కు సిద్దంగా ఉన్న రెండెకరాల ధాన్యంకు మంటలు అంటు కొని రాశిలో ఉన్న ధాన్యం బస్తాల్లో నింపిన దాన్యం పూర్తిగా కాలిపోయినట్లు బాధితుడు తెలిపారు. నోటికాడికి వచ్చిన పంట కల్ల ముందే దగ్ధం కావడంతో రైతు రాజేష్ బోరుమన్నాడు. ప్రభుత్వ అధికారులు స్పందించి ఆర్థికంగా అదుకోవాలని రైతులు, గ్రామస్తులు కోరారు.