Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హన్మకొండ/సుబేదారి
పదవ తరగతి పరీక్షలు మొదటి రోజు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరీక్షా కేంద్రాలను సందర్శించి విద్యా శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా కేంద్రంలోని సుబేదారిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలసముద్రంలోని నేషనల్ హై స్కూల్లలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఎండ తీవ్రత వల్ల ఇబ్బందులకు గురికాకుండా పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల ఓఎంఆర్ షీట్, పశ్నాపత్రాలను పరిశీలించారు. మొదటి రోజు పరీక్ష పూర్తయిన వెంటనే డీఈవో రంగయ్య నాయుడు ప్రథమ భాష పరీక్ష వివరా లను వెల్లడించారు. ఈ పరీక్షకు మొత్తం విద్యార్థులు 12493కు 12437 మంది విద్యార్థులు హాజరయ్యారని మొదటిరోజు పర్యవేక్షణకు కలెక్టర్ రెండు పరీక్ష కేంద్రా లను డీఈఓ రంగయ్య నాయుడు, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి చలపతిరావు నాలుగు పరీక్ష కేంద్రాలను ఆర్ డి ఓ రెండు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం 24 పరీక్ష కేంద్రాలను సందర్శిం చారన్నారు. డీ ఆర్వో వాసు చంద్ర, పాల్గొన్నారు.
ములుగులో 30 మంది గైరాజర్
ములుగు : జిల్లాలో మొదటి రోజు సోమవారం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో 21 పరీక్ష కేం ద్రాలలో 3396 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉం డగా 3366 మంది విద్యార్థులు మాత్రమే హాజర య్యా రు. పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు 144 సెక్షన్ ఏలాంటి సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య పరిశీలించి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.
వెంకటాపూర్ : మండల కేంద్రంలోని జడ్పిహెచ్ఎస్ పాఠశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ కృష్ణ ఆదిత్య తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 21 కేంద్రాల్లో పరీక్షల ను ములుగు వెంకటాపూర్ మంగపేట, ఏటూరు నాగా రం, తాడ్వాయి గోవిందరావుపేట, వాజేడు, వెంక టాపురం, మండలాల్లో ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో కరోనా నిబంధనలను అధికారులు అమలు చేశారు.
దామెర : మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని విద్యా శాఖ వారు ఏర్పాటు చేసినారు, అధికారులు పరీక్షలకు సంబంధించి అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు' 190 మంది విద్యార్థులకు పరీక్ష కేంద్రంలో సీట్లను అలాట్మెంట్ చేసినారు .పూర్తి స్థాయిలో విద్యార్థులు హాజరైనారు అని విద్యాశాఖ వారు తెలిపారు, పరీక్షా కేంద్రంలో మంచినీటి సౌకర్యం ప్రాథమిక వైద్యం మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐ హరిప్రియ ఆధ్వర్యంఏలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు .స్థానిక ఎమ్మార్వో రియాజుద్దీన్ పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు.
తాడ్వాయి : పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. నార్లపూర్ పరీక్షా కేంద్రంలో 171 మంది విద్యార్థులు, తాడ్వాయిలోని ఇంద్రానగర్‌లో 147 మంది విద్యార్థులు మొత్తం 318 విద్యార్థులు హాజ రైనట్లు ఎంఈవో యాప సాంబయ్య తెలిపారు. మొత్తం 319 మంది విద్యార్థులకు గాను 318 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఒక విద్యార్థి గైర్హాజరయ్యాడని తెలిపారు. కేంద్రాల్లో విద్యాశాఖ అధికారులు తాగునీటి సరఫరా, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
శాయంపేట : పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 344 మంది విద్యార్థులకు ఒక్కరు గైర్హాజరైనట్లు ఇన్చార్జి ఎంఈవో సంపతి రమాదేవి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో భద్రపరిచిన పరీక్ష పత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లారు. పరీక్ష పూర్తి కాగానే తిరిగి సీల్ వేసి పోలీస్ స్టేషన్లో భద్రపర్చారు.