Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఎం ఆధ్వర్యంలో ఎర్రజెండాలు పాతిన పేదలు
- అడ్డుకున్న పోలీసులు, స్థానికులు
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ వ్యవసాయ మార్కెట్ సమీపంలోని ముసలమ్మకుంట వద్ద సోమవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సిపిఐ (ఎం) ఆధ్వర్యంలో సుమారు 150 మంది పేదలు సర్వే నెంబర్ 78లో ఎర్రజెండాలు పాతరు. అయితే ఈ భూమి తమదేనని దేశాయిపేట, ఎనుమాముల ప్రాంతాలకు చెందిన దళితులు అడ్డుకు న్నారు. పట్టా భూమిలో జెండాలు ఎలా పాతుతారని వాగ్వివాదానికి దిగారు. ఇంతలో సమాచారం అందుకున్న ఇంతెజార్ గంజ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలతో మాట్లాడి అక్కడినుండి పంపించారు. ఈసందర్భంగా సిపిఐ (ఎం) కాశిబుగ్గ ఏరియా కార్యదర్శి ఎండి బషీర్ మాట్లాడుతూ సర్వే నెంబర్ 78లో ప్రభుత్వ భూమి ఐదు ఎకరాలు ఉండగా ఇండ్లు లేని నిరుపేదలు అందులో జెండాలు పాతారని అన్నారు. కానీ కొంతమంది స్థానిక దళితులు ఇభూమి సర్వే నెంబర్ 130 అని, ఇది తమ పట్టా భూమి అని తమను అడ్డుకున్నట్లు తెలిపారు. నగరంలోని ఎక్కడ భూ పోరాటాలు నిర్వహించిన అధికార పార్టీకి చెందిన నాయకులు, భూకబ్జాదారులు దళితులను, వారి బినామీలను ముందు పెట్టి తమను అడ్డుకుంటున్నారని అన్నారు.