Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీ(ఐ)ఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నలిగంటి రత్నమాల
నవతెలంగాణ-వరంగల్
పేదలకు ఇల్లు, ఇంటి స్థలాలు వచ్చే వరకు పోరాడుతామని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు నలిగంటి రత్నమాల అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో సర్వే నంబర్ 249 లో 400 ల మంది నిరు పేదలు గుడిసెలు వేసుకున్న విషయం విధితమే. సోమవారం పోలీసులు గుడిసెల దగ్గరకు వచ్చి గుడిసెలు తీయాలనీ ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ఎల్పి గండి వద్ద 249 సర్వే నంబర్ లో పంచారై భూమీ 10 ఎకరాలు ఉందని రెవెన్యూ రి కార్డ్ ప్రకారం ఉన్న సర్వే నంబర్ని, ఏసీపీకి చూపించామని పేర్కొన్నారు. చివరి రక్తం బొట్టు వరకు' పేదలకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో ఖిలావరంగల్ ఏరి యా కమిటీ నాయకులు సుతారి సారంగపాణి, ఉదరు, తిరుపతి, ఉమా రమ, లత తదితరులు పాల్గొన్నారు.