Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ కి వినతి పత్రం
నవ తెలంగాణ-ఖానాపురం
వరంగల్ జిల్లాలోని పనిచేస్తున్న ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ వేతనాలు పెంచాలని జిల్లా అధ్య క్షుడు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా ఈ- పంచాయతీ ఆపరేటర్ల అసోసియేషన్ తరపున జిల్లా కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ హరిసింగ్కి వినతి పత్రం అందజేశారు తాము 2015 సంవత్సరం కార్వి అనుబంధ సంస్థ ద్వారా నియమించబడి నెలవారి వేతనం రూ.6700 తీసుకుం టూ పని చేస్తున్నామన్నారు. ప్రస్తుతం వేతనం రూ.17,500 వస్తుందని కానీ ఆపరేటర్లకు రోజువారీ ఖర్చులు, నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ప్రస్తుత జీవనోపాధికి ఆర్థిక వెసులుబాటు చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. ఇతర జిల్లాలో ఈ-పంచాయతీ ఆపరేటర్లకు నెలవారి వేతనం రూ.22,750 వరకు పెంచారని అదేవిధంగా వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న ఈ-పం చాయతీ ఆపరేటర్లకు కూడా వేతనం రూ.22,750 కి పెంచాలని కోరారు. ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లను ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖజానాల ద్వారా వేతనాలు అందే విధంగా చూడాలని కోరారు స్పందించిన కలెక్టర్, అదనపు కలెక్టర్ పరిశీలించి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ సంతోష్, కార్యవర్గ సభ్యులు రాకేష్, మనోజ్, రాంబాబు, వోమ సురేష్ తదితరులు పాల్గొన్నారు.