Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. సోమవారం భూపాలపల్లి పట్టణంలోని రావినారాయణరెడ్డి భవన్ లో సీపీఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కొరిమి రాజకుమార్ హాజరై మాట్లాడారు. ధరల నియంత్రణలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యా యన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలన కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ఎనిమిది రూపాయలు సరిపోవని రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గిస్తే కొంత ఉపశమనం లభిస్తుందన్నారు. పెట్రోల్ డీజిల్ రూ.60 పెంచి రూ.8 తగ్గించి గొప్పలు చెప్పుకోవడం బీజేపీకి సిగ్గుచేటని అన్నారు. తగ్గించిన పెట్రోల్ డీజిల్ ధరలకు అనుగుణంగా ఆర్టీసీ నిత్యావసర ధరలు కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే ప్రయత్నమే తప్ప పేదల అభ్యున్నతి కోసం ఏమీ చేయడం లేదని అన్నారు. పెంచిన నిత్యావసర ధరలు తగ్గించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సతీష్, ఐ శంకర్,మల్లయ్య, నేరెళ్ల జోసఫ్, సమ్మయ్య, రాజయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.