Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు గండ్ర
నవతెలంగాణ-శాయంపేట
రైతులు విక్రయిస్తున్న వరి ధాన్యంలో తూకంలో కోతలు లేకుండా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని జోగంపల్లి, మైలారం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడంలో నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జోగంపల్లిలో ధాన్యం కొనుగోలు సెంటర్ ప్రారంభించి 15 రోజులు కావస్తున్నా కాంటాలు పనిచేయక, లారీలు రాక రైతులు నానా అవస్థలు పడుతున్నా పట్టించుకున్న నాథుడే లేడని మండిపడ్డారు. మిల్లుకు తీసుకెళ్లిన ధాన్యాన్ని కూడా బస్తాకు రెండు నుండి 3 కిలోల చొప్పున తరుగు తీస్తున్నా స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మంత్రులు మిల్లర్లపై చర్యలు తీసుకున్నా దాఖలాలు లేవని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు దూదిపాల బుచ్చిరెడ్డి, చింతల భాస్కర్, మామిడిపల్లి సాంబయ్య, మారపెల్లి రవీందర్, కుమారస్వామి, కృష్ణమూర్తి, రమేష్, రజనీకాంత్, కిరణ్, విష్ణు, కటయ్య, రాజేందర్, పాల్గొన్నారు.