Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
రైతులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా బుచ్చయ్య అన్నారు. సోమవారం మండలంలోని లక్ష్మీపూర్ పంచాయితీలో జిసిసి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ లావుడ్యా స్వాతి ఆధ్వర్యంలో ప్రారంభించారు. కార్యక్రమానికి బుచ్చయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చివరి గింజ వరకు కొనుగోలు జరుగుతాయని తెలిపారు. ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల నిబంధనల మేరకు ధాన్యాన్ని తరలించి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిసిసి మేనేజర్ శ్రీనివాస్, మండల రైతు సమన్వయ సమితి పిన్నింటి మధుసూదన్‌రెడ్డి, జిల్లా రైతు సమనవ్య సమితి సభ్యులు లకావత్ మమత, మాజీ ఎంపీటీసీ లాకావత్ చందూలాల్, కర్లపల్లి సర్పంచ్ ఈక రాంమంజయ, జిసిసి ఇన్చార్జి ఎట్టి స్వరూప, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు జెల్లెల కొమురయ్య, ఈక రామారావు పాల్గొన్నారు.