Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏవో గంగా జమున
నవతెలంగాణ-శాయంపేట
రైతులు పంట సాగులో యూరియా ఒకేసారి వేయకుండా, విడతలవారీగా వేయడంతో పురుగుల ఉదతి, తెగుళ్ళ తాకిడి తగ్గించుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి కె. గంగాజమున రైతులకు సూచించారు. మండలంలోని మైలారంలో సోమవారం వానకాలం సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం చేపట్టగా ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని మాట్లాడారు. వరిలో విత్తనాలు వెదజల్లే పద్ధతి వలన కూలీల ఖర్చు, విత్తన మోతాదు తగ్గుతుందన్నారు. పంట పొలాల్లో ఉన్న పంట అవశేషాలను కాల్చి వేయడంతో భూసారం తగ్గుతుందని తెలిపారు. సబ్సిడీపై జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, కావలసిన రైతులు పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ లు సమర్పించి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ అరికాళ్ళ ప్రసాద్, ఎంపీటీసీ గడిపే విజయవిజరుకుమార్, ఏఈవో శివకుమార్, ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పల్లెబోయిన సారయ్య, రైతులు పాల్గొన్నారు.