Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యారంగంలో నూతన విప్లవానికి నాంది
- మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
నవతెలంగాణ-ఐనవోలు
కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలం పున్నేలు ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.54. 50 లక్షలతో చేపట్టనున్న పలు అభివద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ కత్తి దేవేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ మండలంలో మొత్తం తొమ్మిది పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటుకు రూ.2.13 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అందులో భాగంగా సోమవారం పున్నేల్ గ్రామ జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల అభివద్ధి కోసం రూ. 54.50 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ విద్యార్థికి అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో మన ఊరు మనబడి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదుల నిర్మాణం, విద్యుద్దీకరణ, పైకప్పు మరమ్మతులు, ప్లోరింగ్, డైనింగ్ హాల్ నిర్మాణం, వంటగది నిర్మాణం, ప్రహరీ, నీటి వసతితో కూడిన టాయిలెట్స్, అధునాతన ఫర్నీచర్ తదితర సౌకర్యాలన్ని సమాకూరుతాయని పేర్కొ న్నారు. కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపీపీ మార్నెని మధుమతి రవీందర్ రావు, ఎంపిటిసి చాట్ల అరుణ, డీసీఓ నాగేశ్వర్ రావు, మన బడి మా బాధ్యత కన్వీనర్ దోమ కుమార్, ఎస్ఎంసి చైర్మన్ కుమారస్వామి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధిలో రాజీపడేది లేదు
గ్రామాల అభివృద్ధిలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని, అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం మండల అభివద్ధి పనులపై వివిధ శాఖల అధికారులు, మండల ప్రజా ప్రతినిధులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామాల వారీగా జరుగుతున్న అభివద్ధి పనుల వివరాలను అధికారులు, ప్రజా ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని ప్రతీ గ్రామంలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే నా దష్టికి తీసుకురావాలని సూచించారు. మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపీపీ మార్నేని మధుమతి రవీందర్రావు, వైస్ ఎంపిపి తంపుల మోహన్, నందనం సొసైటీ వైస్ చైర్మన్ తక్కళ్లపెల్లి చందర్ రావు, రైతు బందు సమితి అధ్యక్షులు మజ్జిగ జైపాల్, ఐనవోలు దేవస్థాన కమిటీ చైర్మన్ మునిగాల సంపత్, మండల పార్టీ అధ్యక్షులు పోలేపల్లి శంకర్ రెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.