Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఐ(ఎం) రాష్ట్ర నాయకులు సూడి కృష్ణారెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో ప్రజలకు అంద కుండా పోతున్నాయని సిపిఐ(ఎం)రాష్ట్ర నాయకులు సూడి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వ ర్యంలో 163వ జాతీయ రహదారిపై భారీ ర్యాలీ, ధర్నా కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డు పోడుభూములకు పట్టాలు, ధరణి సమస్యలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని సంబంధిత సమస్యల పరిష్కారానికి ధర్నా చేస్తున్నామని, ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజ లు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం తహసీల్దార్ అల్లం రాజ్ కుమార్కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బీరెడ్డి సాంబశివ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభు త్వ దివాలాకోరు విధానాల వలన విద్యార్థులకు యువతకు రైతులకు, కార్మికులకు, మహిళలకు ఉద్యోగులకు అణగారిన వర్గాల కు ఏ ఒక్కరికి కూడా సరైన న్యాయం జరగడం లేద న్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతను తప్పక చవి చూస్తారన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తీగల ఆదిరెడ్డి, పొదిల్ల చిట్టి బాబు, గోంది రాజేష్, గుండు రామస్వామి, సామచంద్రారెడ్డి, కడారి నాగరాజు, పిఎసిఎస్ డైరెక్టర్ సప్పిడి ఆదిరెడ్డి, అంబాల మురళి, కొలిపాక మహేందర్, ఐలయ్య, పల్లపు రాజు, ముంద్రతి రాజు, సర్వర్ తదితరులు పాల్గొన్నారు.