Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, గోపి, కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ-సుబేదారి
ప్రజావాణిలో దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. వివిధ సమస్యల పై ప్రజల నుండి వినతులను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా ప్రజలకు వెంటనే సేవలు అందించాలన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో 124 దరఖాకాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో, అదనపు కలెక్టర్ సంధ్య రాణి, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
హన్మకొండ : సోమవారం జరిగిన గ్రీవెన్స్ కి 57 దరఖాస్తులు వచ్చాయని వాటిని త్వరగతిన పూర్తి చేయా లని వరంగల్ జిల్లా కలెక్టర్ బి గోపి అధికారులను ఆదేశిం చారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ప్రజల విజ్ఞాపనలు స్వీకరించి వాటిని సంబందిత అధికారులకు ఎండార్స్ చేస్తూ వాటిని త్వరిత గతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎండను సైతం లెక్కచేయకుండా వివిధ రకాల సమస్యలు మరియు ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాల కొరకు అర్జీలు ఇవ్వడానికి వచ్చే దరఖాస్తుదారులకు అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అర్హులైన వారికి తప్పకుండా ప్రభుత్వ పథకాలు అందేలా సంబంధిత విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు హరి సింగ్ శ్రీవత్సవ. సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ములుగు : గ్రీవెన్స్ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కలెక్టర్ ప్రజల విజ్ఞాపనలు స్వీకరించి వాటిని సంబందిత అధికారులకు ఫార్వర్డ్ చేస్తూ వాటిని త్వరిత గతిన పరిష్కారించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల సంక్షేమ పథకాల అభివృద్ధి పై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని మండలాల వారిగా శ్యాం మ్యామ్ పిల్లల ను గుర్తించి వారికి పౌష్ఠిక ఆహారం ఇచ్చే లా చూడాలని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ, చైల్డ్ వెల్ఫేర్ అధికారికి ప్రేమలత ఆదేశించారు.జిల్లాలో ఎన్ని ఫిష్ పాండ్స్ ఉన్నాయి, వాటి సామర్ధ్యం వివరాలు తెలిసేలా బోఅర్డ్స్ ఏర్పాటు చేయాలని, ఫిషర్ మెన్స్ నివేదిక తయారుచేసి నివేదికలు పంపాలని , ఫ్లడ్స్ సమయంలో ఉపయోగంగా ఉంటుందనీ జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతిని ఆదేశించారు. జిల్లా లో ఎంత మంది లేబర్స్ ఉన్నారనీ వారికి లేబర్ కార్డ్స్ ఉన్నాయా, లేనట్లు అయితే జిల్లాలో లేబర్ యూనియన్స్ తో మాట్లాడి కార్మిక శాఖ ద్వార కార్మికులకు ఉపయోగపడే పథకాలను ప్లెక్సీ ద్వారా వారికి తెలిసేలా చేలయాలని లేబర్ అధికారి వినోద ను ఆదేశించారు.ఈ ప్రజావాణి దరఖాస్తులు 15 వచ్చాయని, వాటిని త్వరిత గతన పరిష్కారించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఇలా త్రిపాఠి,డిఆర్ఓ కె. రమాదేవి ,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రవి, లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మన్,సిపివో ప్రకాష్, ఆర్ అండ్ బి ఇఇ వెంకటేష్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.