Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసత్య ప్రచారాలను నమ్మొద్దు
- సీపీఎం నుండి దామెర సుదర్శన్ బహిష్కరణ
- సీపీఎం హనుమకొండ వెస్ట్ ఏరియా కార్యదర్శి వాంకుడోతు వీరన్న
నవతెలంగాణ -హనుమకొండ
సీపీఎం నుండి ఎవరు వేరే పార్టీలోకి వెళ్లలేదని సీపీఎం పార్టీ క్రమశిక్షణకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించి ఎం సిపిఐ పార్టీలోకి వెళ్ళిన దామెర సుదర్శన్‌ను పార్టీ నుండి బహిష్కరిస్తున్నామని సీపీఎం హనుమకొండ వెస్ట్ ఏరియా కార్యదర్శి వాంకుడోత్ వీరన్న ప్రకటించారు. సోమవారం సీపీఎం హనుమకొండ వెస్ట్ కార్యాలయంలో పార్టీ హన్మకొండ వెస్ట్ ఏరియా కమిటీ సమావేశం కుక్కముడి రవీందర్ అద్యక్షతన జరిగింది. సమావేశంలో వీరన్న మాట్లాడుతూ సీపీఎం పార్టీ క్రమశిక్షణ పార్టీ అని పార్టీ క్రమశిక్షణకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించి ఎంసిపిఐ పార్టీలోకి వెళ్ళిన సుదర్శన్‌ను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఆయనతో పాటు మరికొందరు సీపీఎం పార్టీ నుండి ఎంసిపిఐ లోకి వెళ్లినట్లు పత్రికలలో వచ్చిన విషయాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, సుదర్శన్ మినహా ఏ ఒక్క పార్టీ సభ్యులు కూడా సిపిఎం పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. పైగా కొందరు ఇంజనీరింగ్ కాలనీ గుడిసె వాసులను కార్య కర్తలను మభ్యపెట్టి ఎంసిపిఐ ఆఫీస్ వద్దకు బలవంతంగా తీసుకెళ్లి ఆ పార్టీలో చేరు తున్న ట్లు ప్రకటించారని తీవ్రంగా ఖండిం చారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగా గతంలో సుదర్శన్ అనేకమార్లు ఈ విషయంపై చర్చించి మందలించామని అయినా ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆయనను బహిష్కరిం చామని తెలిపారు. గత రెండు సం వత్సరాల క్రితమే పార్టీ విధానాలకు భిన్నం గా వ్యవహరించిన అజ్మీరా వెంకన్నను పార్టీ నుంచి తొలగిం చామన్నారు. ఆయనకు సిపిఎం పార్టీకి ఎలాంటి సం బంధం లేదని కానీ కొన్ని పత్రికలలో ఆయన మండల కార్యదర్శిగా ప్రకటించు కుంటున్నారని దీనిని ఎవరూ నమ్మవద్దని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం ఏరియా కమిటీ సభ్యులు డి, భాను నాయక్, లింగమూర్తి, రాజు స్వామిదాస్, రోజా, అరుణ, అనిత వెంకన్న తదితరులు పాల్గొన్నారు.