Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించా లని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. సోమవారం భూపాలపల్లి కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అధికారులు తమ శాఖల వారీగా వచ్చిన విన్నపాలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 20 దరఖాస్తులు స్వీకరించినట్టు తెలిపారు. ఆయా శాఖల అధికారులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ శశాంక
మహబూబాబాద్ : ప్రజావాణి ఆర్జీలను, డయల్ యువర్ కలెక్టర్ లో ఫోన్ ద్వారా తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె శశాంక జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో డయల్ యువర్ కలెక్టర్, ప్రగతి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల వినతులు స్వీకరించారు. ప్రజా ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. జూన్ 2వతేదీన నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో రెండు సంవత్సరాల నుండి ఆయా శాఖలు సాధించిన ప్రగతి ప్రజల ముందు ఉంచేందుకు ప్రగతి నివేదికను సీపీఓకు అందించాలని ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో 65 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. అంతకుముందు ప్రజ్ఞా సమావేశ మందిరంలో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో 13మంది సమస్యలు తెలిపారు. అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఎం డేవిడ్, జెడ్పీ సీఈఓ రమాదేవి, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ సాయిబాబా, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి వెంకట రమణ, పర్యవేక్షకులు అనురాధ, తదితరులు పాల్గొన్నారు.
స్పందించాలి : శివలింగయ్య
జనగామ కలెక్టరేట్ : ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు సత్వరమే స్పందిం చాలని జిల్లా అధికారులకు కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా వాణిల ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. జనగామలో శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలకు అనుమతి లేకున్నా అడ్మిషన్లు తీసుకుంటున్నాయంటూ ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు చిలువేరు అభి గౌడ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. లింగాల గణపురం మండలం చిటూరు గ్రామానికి చెందిన వికలాంగురాలు మాలగౌని కమలమ్మ కుట్టుమిషన్ తో ఉపాధి పొందుతున్నానని, కిరాణా దుకాణం ఏర్పాటుకు రుణం అందించాలని కోరారు. అదే గ్రామానికి చెందిన వికలాంగురాలు వాతాల బుచ్చమ్మ కూడా తనకు కూరగాయల దుకాణానికి రుణం మంజూరు చేసి ఆదుకో వాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి చెప్పుల దుకాణానికి రుణం అందించాలని దేవరుప్పుల మండలం నిర్మల గ్రామానికి చెందిన మేడ సుధాకర్ వినతిపత్రం అందజేశారు. నర్మెట మండల కేంద్రానికి చెందిన వికలాంగుడు గోపగోని శ్రీనివాస్ పింఛను ఇప్పించాలని మొరపెట్టుకున్నాడు. నర్మెట్ట మండల కేంద్రానికి చెందిన కృష్ణారెడ్డి తనకు 4.20 గుంటల భూమిలో అర ఎకరం భూమి ఇతరులు ఆక్రమించారని ఆదుకోవాలని కోరారు. స్టేషన్గన్పూర్ మండల కేంద్రానికి చెందిన గడ్డపాక బంగారు నాని తాను ఎస్సీనని, కూలి పనులు చేసుకుంటూ డిగ్రీ చదువుకుంటున్నానని ఉపాధి కోసం ఆదుకోవాలని కోరారు. ప్రజావాణిలో 45 దరఖాస్తులు వచ్చాయి. అదనపు కలెక్టర్లు అబ్దుల్ హమీద్, భాస్కర్రావు పాల్గొన్నారు.