Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
పల్లెల సర్వతోముఖాభివృద్ధికి పల్లె ప్రగతి పేరిట సీఎం కేసీఆర్ దేశంలోనే అత్యంత అరుదైన మార్క్ పొందారని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. సోమవారం డివిజన్ కేంద్రంలో జెడ్పీ నిధులు రూ.5లక్షల తో సీసీ రోడ్డు పనులకు జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ నాయక త్వంలో రాష్ట్రాన్ని దేశంలో ఎక్కడాలేని అభివృద్ధి పల్లె ప్రగతి ద్వారా సాధ్యం చేశారని అన్నారు. దేశ చరిత్రలో గ్రామాలకు అనేక మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎంపికైన 20గ్రామాల్లో ఒకటి మినహా అన్ని గ్రామాలు రాష్ట్రం నుంచి ఎంపికవ్వడం హర్షణీ యమన్నారు. గ్రామ పంచాయతీలకు విధులతో పాటుగా నిధులు కూడా అవసరమని భావించి ప్రతి నెల గ్రామపంచాయతీ ఖాతాలో జనాభా ప్రాతి పదికన నిధులు జమచేస్తున్నట్టు తెలిపారు. పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన తోపాటు, గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో చేపడుతున్న ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేఖ, సర్పంచ్ సురేష్, మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్, ఎంపీటీసీ గన్ను నర్సింహులు, గుర్రం రాజు, ఏసుబాబు, ప్రసాద్ బాబు, గుండె మల్లేష్, ఆకారపు అశోక్, గాదె రాజు, బొల్లులక్ష్మి, జ్యోతిరెడ్డి, పావని, మౌనిక, తదితరులు పాల్గొన్నారు.