Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన కూలీలకు మూడు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సం ఘం మండల కార్యదర్శి బుర్రి ఆంజనేయులు డిమాండ్ చేశారు. మంగళవారం మండంలోని ఇటుకాలపెల్లి గ్రామంలో వ్యకాస ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మా ట్లాడుతూ ఎర్రటెండలో కూలీలు పనులు చేయగా ప్రభు త్వం మూడు నెలలు గడిచినా చెల్లించకపోవడం శోచనీ యమన్నారు. కూలీలు ఆర్థాకలితో అలమటిస్తూ పనులు చేయాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్‌లోని వేతనాలను చెల్లించాలన్నారు. క్యూబిక్ మీటర్‌తో సంబంధం లేకుండా రూ.250లను, వేసవి అలవెన్స్ ఇవ్వాలన్నారు. పనిప్రదేశాల వద్ద మంచినీరు. నీడ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. నేషనల్ మానిటర్ సిస్టం పద్ధతి ద్వారా కూలీల హాజరుకై జారీ చేసిన నెం.333 ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కూలీల సమస్యలను పరిష్కరించకుంటే తీవ్ర స్థాయి ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బషికే మొగిలి, మచ్చిక లలిత, పెండ్యాల సారయ్య, దేశిమి రవి, కాటిపాక చేరాలు, బండపల్లి రామక్క, రజిత తదితర కూలీలు పాల్గొన్నారు.