Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-మట్టెవాడ
ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో 53 రకాల చికిత్సలు చేస్తారని ఆరోగ్యశ్రీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.మనోహర్ పేర్కొ న్నారు. పిహెచ్సీలో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించే ముందు హనుమకొండ, వరంగల్ జిల్లాల ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు మంగళవారం రిలీఫ్ హాస్పిటల్ సమావేశ మందిరంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లా డారు. ప్రాథమిక వైద్య సేవలను బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్ లో 1672 చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ఇందులో ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రులు, కమ్యూనిటి ఆసుపత్రుల్లో 658 రకాల వైద్య సేవలు, చికిత్సలు అందిస్తుండగా త్వరలో 53 రకాల చికిత్సలు పీహెచ్సీ స్థాయిలో అందించడం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు లేనివారు తెల్ల రేషన్ కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు ను తీసుకొని రావాల న్నారు. ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ అభిలాష్, బందం పేపెంట్ రిజిస్ట్రేషన్, వివరాలు నమోదు, అప్రూవల్ విధానం, చికిత్స వివరాల నమోదు , క్లెయిమ్ చేసే విధా నము, తదితర అంశాలపై శిక్షణ నిర్వహించారు. హనుమ కొండ డీఎంహెచీ డాక్టర్.బి సాంబశివరావు, వరంగల్ డీఎంహెచ్వో డాక్టర్ కె వెంకటరమణ మాట్లాడుతూ ప్రభు త్వ నియమాలకు అనుగుణంగా పీహెచ్సీ లలో ఆరోగ్య శ్రీ సేవలందించడానికి తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్యక్ర మంలో ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ అభిలాష్, హనుమకొండ డిప్యూటీ డిఎంహెచో డాక్టర్ఎండి యాకూబ్ పాషా, జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ మల్లికార్జున్ డిటిసిఓ, డాక్టర్ ఉమా శ్రీ, డాక్టర్ గీత లక్ష్మి, డాక్టర్ వాణి శ్రీ, డెమో వి అశోక్ రెడ్డి, ఎసీ ప్రసన్నకుమార్, వరంగల్ జిల్లా ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.