Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నవతెలంగాణ-సుబేదారి
పల్లె, పట్టణ ప్రగతి పనులు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. మంగళ వారం హనుమకొండ కలెక్టర్ కార్యాలయ మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ జిల్లాలో కొనసాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి పనులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే జూన్‌లో తెలంగాణకు హరిత హారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమర్ధవంతంగా చేపట్టాలని అన్నారు.పెండిగ్ లో ఉన్న పనులు గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, ప్లాంటేషన్, గేట్ ఆర్చి, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, డేన్స్ ప్లాంటేషన్, వైకుంఠ ధామలు, తదితర పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో వంద శాతం ఇంటి పన్ను, నల్ల, విద్యుత్, బిల్లులు వసూలు చేయాలని, మిషన్ భగీరథ కనెక్షన్ అందరూ తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ పరిధిలో ఉన్న వెంచర్స్‌కు అనుమతి ఇవ్వాలని అన్నారు. మండలానికి కనీసం ఒక్క బహత్ పల్లే ప్రకతి వనాలను ఏర్పాటు చేయాలని, పల్లెప్రకతి వనాల్లో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలని చెప్పారు. జిల్లాలో నేషనల్ హై వే వెంబడి మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ లక్ష్యం పూర్తి చేసి మొక్కలను సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, ఆర్డివో వాసు చంద్ర, డీఆర్డివో, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ. శ్రీనివాస్ కుమార్, డీపీవో వి.జగదీశ్వర్, ఎంపిడిఓలు, ఎంపిఓ లు, సిబ్బంది పాల్గొన్నారు.