Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
అధిక ధరలు, పన్నుల భారాలకు వ్యతిరేకంగా చేపట్టే నిరసన కార్యక్రమా లను జయప్రదం చేయలని సిపిఐ వరం గల్ జిల్లా కార్యదర్శి మేకల రవి పిలుపునిచ్చారు. మంగళవారం సిపిఐ జి ల్లా కార్యాలయం తమ్మెరభవన్లో వా మపక్ష పార్టీల సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో నరేం ద్ర మోడీ నాయకత్వంలో నడుస్తున్న బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ధర లను విపరీతంగా పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై పెను భారాలు మోపుతోందని ,రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ధరలపై విమర్శిస్తూనే విద్యుత్ ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఈనెల 27న అన్ని మండల కార్యాలయల ముందు నిరసన, మే 30న కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తా మని చెప్పారు. కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి సిహెచ్.రంగయ్య, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు బాలరాజు, ఆర్ఎస్పి జిల్లా నాయకులు కే శివాజి, ఎంసిపిఐ(యు) నాయకులు గడ్డం నాగార్జున, సిపిఐ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ బాష్ మియా, సీపీఎం జిల్లా నాయకులు సింగారపుబాబు, సిపిఐ వరంగల్ జిల్లా నాయకులు గన్నారపు రమేష్, సంగీ ఎలేంధర్ ఏఐఎస్ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు ల్యాదల్ల శరత్ తదితరులు పాల్గొన్నారు.