Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ-వరంగల్
రానున్న వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపు నకు గురి కాకుండా డిసిల్టింగ్ ప్రక్రియ సమర్ధవంతంగా జరగాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. నగరం లోని 22, 13, 14 డివిజన్లలో డిసిల్టింగ్ ప్రక్రియను ఆయా డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి మేయర్ మంగళవారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. 22వ డివిజన్లోని ఆటోనగర్ నుండి అన్ లిమిటెడ్ షో రూమ్ వరకు అక్కడి నుండి దేశాయిపేట వరకు నాలాల్లో పూడిక తీస్తున్న తీరును ఆమె పరిశీలించారు. టెండర్ అయిన పనులు మాత్రమే కాకుండా, వీటితో పాటు కార్పొరేటర్లు కోరిన విధంగా ఇతర నాలాల పూడికతీత చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. డ్రైన్స్ లేని ప్రాంతాల్లో ఖచ్చా నాలాలను ఏర్పాటు చేసి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద మంజూరైన 2 కల్వ ర్టుల నిర్మాణం వెంటనే చేపట్టాలని ఆదేశించారు.13వ డివి జన్ పరిధి దేశాయిపేట నవయుగ కాలనీ పరిశీలించారు. చిన్న వడ్డేపల్లి చెరువులో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలన్నారు.14వ డివిజన్ ఎస్ ఆర్ నగర్, బాలాజీ నగర్, సాయి గణపతి, మధురానగర్, లక్ష్మీ గణపతి కాలనీ ప్రాంతాల్లో పర్యటించి డిసిల్టింగ్ తీరును పరిశీలించారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్లు బస్వరాజు కుమారస్వామి, సురేష్ జోషి, తూర్పాటి సులోచన, డీఈ రవికిరణ్, ఏఈలు కష్ణమూర్తి, కార్తిక్, సానిటరీ ఇన్స్పెక్టర్లు ఎల్లా స్వామి, ఇస్రం శ్రీను, జవాన్ గోల్కొండ కుమార్, స్థానికులు గూడూరు కష్ణ, యూసుఫ్, ప్రభాకర్, ఏసోబు రాజు, పాల్గొన్నారు.