Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నడికూడ
పశువుల మేత కోసం మేకల మొగిలి గడ్డిని ట్రాక్టర్లో తీసుకొస్తున్న క్రమంలో విద్యుత్ తీగలకు తగిలి షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగడంతో గడ్డితోపాటు ట్రాక్టర్ డబ్బా టైర్లు కాలిపోయిన ఘటన మంగళవారం మండలంలోని కంఠాత్మకూర్‌లో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతుండడంతో కర్ర సహాయంతో రైతులు పైకి లేపినా వెనకాల గడ్డికి తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించారు. వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బంది వాటర్‌ట్యాంకర్ సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ చాక చక్యంతో డబ్బా నుండి ట్రాక్టర్ ఇంజన్‌ను తప్పించి ప్రాణ నష్టం నుండి బయటపడ్డారు. సర్పంచ్ రేకుల సతీష్, ఉప సర్పంచ్ రాయుడి దేవేందర్ రెడ్డి, కారోబార్ రమేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ స్తులు కలిసి మంటలు ఆర్పేశారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు రహదారులపై ఉన్న విద్యుత్ లైన్లను లోడ్‌తో వచ్చే వాహనాలకు తగలకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.