Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేయూ ఉపకులపతి రమేష్
నవతెలంగాణ-సుబేదారి
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ, పీజీ పరీక్షలు విద్యా క్యాలెండర్ ప్రకారం పూర్తి చేయాలని కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య టి. రమేష్ అన్నారు. మంగళవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులతో సమావేశమైన ఆ యన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కార ణంగా విద్యా సంవత్సరం దెబ్బతిన్న కారణంగా ఈ సంవత్సరం నుండి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి అధ్యాపకులు కషి చేయాలన్నారు. సమయానుకూలంగా 40 శాతం బోధన ఆన్లైన్ ద్వారా, 60 శాతం బోధన ఆఫ్ లైన్ ద్వారా బోధనకు అధ్యాపకులు సిద్ధం కావాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యాలెండర్ ప్రకారంగా పరీక్షలు నిర్వహించే విధంగా సిలబస్ పూర్తిచేయాలని సూచించారు. విద్యా ర్థులకు మౌళిక వసతుల కల్పనకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని, అధ్యాప కులకు కూడా జీతభత్యాలు ప్రతి నెలా 10 వరకు చెల్లించే విధంగా తగిన ఏర్పా ట్లు చేస్తామని చెప్పారు. అధ్యాపకులు పరిశోధనా రంగంపై శ్రద్ధ చూపాలని, అధ్యాపకుడు నిరంతరం విద్యార్థిగానే అభ్యసన చేయాలని వీసీ అన్నారు. బోధన, బోధనేతర ఉద్యోగస్తులు సమ యపాలన పాటించాలని, సమయ పాల న పాటించని ఉద్యోగస్తులపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రిన్సిపాల్ ఆచార్య బన్న ఐలయ్య మాట్లాడుతూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పరీక్షలు విద్యా క్యాలెండర్ ప్రకారంగానే, విశ్వవిద్యాలయ సూచన మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపల్ ఆచార్య హనుమంతు, కళాశాల సహాయక రిజిస్టర్ కిష్టయ్య, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.