Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు పిలుపు
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు కోసం రాజకీయాలకతీతంగా దళితులు దండు కట్టాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం రాంనగర్ సుందరయ్య భవన్లో జరిగిన కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం హన్మకొండ జిల్లాస్థాయి విస్తత సమాy ేశానికి గబ్బెట రాంకుమార్, మంద సంపత్ అధ్యక్షవర్గంగా వ్యవ హరించారు. కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలా బ్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం, కొందరికి కాకుండా ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని డిమాం డ్ చేశారు. రాష్ట్రంలో 18 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని ఇప్పుడిస్తున్న పద్ధతి చూస్తే దళితుల అందరికీ చేరే వరకు వందల సంవత్సరాలు పడు తుందన్నారు. అధికారుల ద్వారా మాత్రమే లబ్ధిదారుల ఎంపిక చేయాలన్నారు. నేటికీ దళితులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరిం చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. కెవిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరూరి కుమార్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బొట్ల చక్రపాణి మాట్లాడుతూ దళితబంధు కొందరికి ఇస్తే కుదరదని అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమిస్తేనే సమస్యలు పరిష్కరిస్కారం అవుతాయని అన్నారు.