Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని పలు బిటీ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో మంగళవారం టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లెడ ఆర్అండ్ బి రోడ్ నుండి ముంజలకుంట తండా వరకు రూ.60 లక్షలు, కల్లెడ ఆర్అండ్ బి రోడ్ నుండి ఆవకుంట చెరువు వరకు రూ. 77 లక్షలు, పిడబ్ల్యూడి రోడ్ నుండి చెక్ డ్యామ్ వరకు రూ. 55 లక్షలు, గుంటూరుపల్లి నుండి చెరువు ముందు తండా వరకు రూ. 80 లక్షలు, పిడబ్ల్యూ డి రోడ్ కల్లెడ నుండి ముంజలకుంట తండా వరకు రూ.430 లక్షలు మొత్తం రూ.7.2 కోట్లతో చేపట్టనున్న బిటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఎఫ్ చైర్మన్ ఎర్రబెల్లి రామ్మోహన్రావు, జెడ్పీటిసి బానోతు సింగులాల్, ఎంపీపీ కమల, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, జిల్లా కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ సర్వర్, సొసైటీ చైర్మన్లు దేవేందర్, మనోజ్ కుమార్, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాస్, సర్పంచ్లు చింతపట్ల మాలతి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.