Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
పేదరికంలో మగ్గుతున్న దళితుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేస్తుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం క్యాంప్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ల్లో దళిత బంధు పథకం కింద మంజూరైన 100 మందిలో 53 మందికి వివిధ రకాలైన యూనిట్లను పంపిణీ చేశా రు. ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా కలెక్టర్ బీ.గోపి హాజరు కాగా కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఆరు గ్రామాలకు చెందిన 100 మంది లబ్దిదారులకు మొదటి విడుతగా రూ.10 లక్షల చొప్పున యూనిట్లు మంజూరయ్యాయని తెలిపారు. రెండో దశలో 1500 మందికి యూనిట్లను మంజూరు చేస్తామన్నారు. దశల వారిగా దళితులందరు అర్హులుగా గుర్తించబడుతారని తెలిపారు. ఎంపిక చేసు కున్న యూనిట్లతో లబ్దిదారులు సక్రమైన మార్గంలో ఉప యోగించుకొంటూ ఆర్థికంగా బలపడాలని సూచిం చారు. కేటాయించిన యూనిట్లను ఎట్టి పరిస్థితిలో అమ్ము కోరాదని దళిత బంధు లక్ష్యం నెరవేరడానికి మొదటి విడు త లబ్ధిదారులు ఆదర్శవంతంగా నిలువాలన్నారు. ఈ సం దర్భంగా దళితులకు ట్రాక్టర్లు, ట్రాలీలు, కారులు వంటి వాహనాలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్, ఎస్సీ కార్పో రేషన్ ఈడీ సురేష్, జెడ్పీ టీఆర్ఎస్ ప్లోర్ లీడర్ పెద్ది స్వ ప్న, ఎంపీపీ మోతె కలమ్మ, బాదవత్ వీరేందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, తదితరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
సీఎం సహాయక నిధి నుంచి 150 మంది లబ్దిదా రులకు రూ.47లక్షల విలువజేసే చెక్కుల ను, ఎల్వోసీలను అందజేశారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్‌తో ప్రభుత్వం అండగా నిలిచి మెరగైన వైద్యం అంద జేస్తుందని తెలిపారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీ ఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రభుత్వ, ప్రయి వేటు ఆసు పత్రి లలో వైద్య ఖర్చులు అందజేసి సహాయం చేస్తుంద న్నారు.కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.